మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

  Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం
 

Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం telugu పండుగలు   తెలుగు - కథలు దేవిదేవతలు అద్భుతమైన తెలుగు సూక్తులు |telugu motivation|telugu ... 

హిందూ నాగరికత చారిత్రక కాలక్రమం: క్రీ.పూ. 2000లకు ముందు..... సింధు లోయ నాగరికత - క్రీ.పూ. 1500-500 .... వేదయుగం - క్రీ.పూ. 500-క్రీ.శ.500 .... ఇతిహాస, పురాణ,  చారిత్రక యుగం - క్రీ.శ. 500-1500 .... మధ్యయుగం - క్రీ.శ. 1500-1757 ..... పూర్వ ఆధునిక యుగం క్రీ.శ. 1757-1947 బ్రిటిష్‌‌ యుగం .... సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఆగమాలు మరియు స్తోత్రాలు. ఈ గ్రంథాలలో సనాతన ధర్మం యొక్క మూలాలు, సూత్రాలు, నైతిక నియమాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నాయి. వీటిలో వేదాలు అత్యంత ప్రాచీనమైనవి మరియు ముఖ్యమైనవి, వీటిలో నాలుగు వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణ వేదం.

   

మంథని క్షేత్ర మాహాత్మ్యం


*మంథని క్షేత్ర మాహాత్మ్యం*

ఆకాశాన్ని స్పృశించాలనుకోవడం, నక్షత్రాలను లెక్కించాలనుకోవడం,సప్త సముద్రాలను ఏకధాటిగా ఈదాలనుకోవడం, లక్ష సింహాల మధ్యన కూర్చొని పంక్తి భోజనం చేయాలనుకోవడం ఇవేవీ సాహసాలు కావు...!!!

ప్రశ్న : మరి ఏది సాహసం ...???

జవాబు : మంథని క్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని మాటల్లో వివరించాలనుకోవడం ,అక్షరాల్లో బంధించాలనుకోవడం అవును ఇది నిజం...!!!

ఇక్కడ ప్రతీ చెట్టూ పరదేవతయే , ప్రతీ పుట్టా పరాభట్టారికయే , ప్రతీ అణువు అమ్మ స్వరూపమే...!!!

విశ్వం మొత్తం పరమేశ్వరుని గృహమైతే అందులో పూజా మందిరమే ఈ మంథని క్షేత్రం...!!!

మంథని, "కేవల గ్రామం కాదు అది ముక్తిధామం" ...!!!

చందమామ కావాలని ఏడ్చిన బిడ్డడికి అద్దంలో చూపించి అమ్మ అన్నం పెట్టిన మాదిరి , స్వర్గం ఎలా ఉంటుందో చూస్తాననుకునే ఆస్తికులకి పరమాత్ముఁడు భూమిపై ఉన్న మంథని క్షేత్రాన్ని చూపిస్తాడు...!!!

మంథని క్షేత్రానికి అనాది నామం "మంత్రకూటం". అనగా ఈ క్షేత్రం "దివ్య మంత్రాల కూటమి".ఇక్కడ ప్రతీ గృహం ఓ మంత్రస్వరూపమైతే, ఆయొక్క గృహాల్లో నివసించే ప్రతీ వ్యక్తి ఓ బీజాక్షర స్వరూపం...!!!

జీవులు లక్షల జన్మలలో పుణ్యం చేస్తే మనుషులుగా పుడతారు.కోట్ల జన్మలలో పుణ్యం చేస్తే భరత ఖండంలో పుడతారు.అనంతకోటి జన్మలలో పుణ్యం చేస్తే మంథని క్షేత్రంలో జన్మిస్తారు.ఇది నిత్యసత్యం...!!!

చిదజ్ఞికుండ సంభూతయైన శ్రీ లలితాదేవిని ధ్యానించడానికి సహస్రనామాలు ఉన్నాయి , ఈ సహస్ర నామాలే సహస్ర విప్ర గడపలుగా ఏర్పడ్డ అద్భుత క్షేత్రం మన మంథని క్షేత్రం...!!!

నిష్కల్మష భక్త జనులతో, లౌకిక వాంఛల త్యాగధనులతో, పరమశివుణ్ణి సైతం ప్రసన్నం చేసుకోగల సాధనా ఘనులతో నిత్యం శోభిల్లే మహిమాన్విత క్షేత్రం మన మంథని క్షేత్రం...!!!

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉన్న అయ్య ప్రేమ, అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న అమ్మప్రేమల కలబోత కుండపోతగా వర్షించే గొప్ప తపో భూమిగల క్షేత్రం మన మంథని క్షేత్రం...!!!

ముక్కోటి దేవతల అనుగ్రహ అతివృష్టి క్షేత్రం , కలిపురుషుని కల్మష జల్లుల అనావృష్టి క్షేత్రం , మన మంథని క్షేత్రం...!!!

జపమాల పట్టిన సాధకులకు యోగనిద్రలో జోల పాడుతుంది, కమండలం చేతపట్టిన యోగులకు భానుమండల తేజస్సుని అనుగ్రహిస్తుంది మన మంథని క్షేత్రం...!!!

ఇక్కడ భూమి పొరల కంపనాలు ఓంకారాన్ని ప్రతిధ్వనిస్తాయి, భూగర్భ జలాలు వేదమాత పాదాలను అభిషేకిస్తాయి...!!!

 

 

     

 
       
     

"Bharath First - I Love My Bharath"

   
 

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

 
 

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.