|
|
|
|
రామాయణం ఏముంది?:
108 ప్రశ్నలు –జవాబులతో
55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
జ.) దక్షిణపు దిక్కు.
56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
జ.) కబంధుని.
57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
జ.) మతంగ వనం, పంపానదీ.
58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
జ.) ఋష్యమూక పర్వతం.
59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
జ.) హనుమంతుడు.
60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
జ.) అగ్ని సాక్షిగా.
61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
జ.) కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.
62. సుగ్రీవుని భార్య పేరు?
జ.) రుమ.
63. వాలి భార్యపేరు?
జ.) తార.
64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
జ.) కిష్కింధ.
65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
జ.) మాయావి.
66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
జ.) దుందుభి.
67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
జ.) మతంగముని.
68. వాలి కుమారుని పేరేమిటి?
జ.) అంగదుడు.
69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
జ.) ఏడు.
70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
జ.) ప్రసవణగిరి.
71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
జ.) వినతుడు.
72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
జ.) అంగదుడు.
73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
జ.) మామగారు, తార తండ్రి.
74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
జ.) శతబలుడు.
75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
జ.) మాసం (ఒక నెల).
76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
జ.) దక్షిణ దిక్కు.
77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
జ.) తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.
78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
జ.) స్వయంప్రభ.
79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
జ.) సంపాతి.
80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
జ.) పుంజికస్థల.
81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
జ.) మహేంద్రపర్వతము.
 |

|
|
|
| |
|