మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు ..... రామాయణంలో 24,000 శ్లోకములు ఉన్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజింపబడ్డాయి. రామాయణ ములోని శ్లోకములు అనుష్టుప్ ఛందస్సులో రాయ బడ్డాయి. అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ.11వ శతాబ్దమునకు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

  
  


 

 

 

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి...

Page:01    Page:02       Page:03       Page:04      

రామాయణం ఏముంది?:

108 ప్రశ్నలు –జవాబులతో.

27. అహల్య భర్త ఎవరు?
జ.) గౌతమ మహర్షి.
28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?

జ.) శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?

జ.)నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?

జ.) దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?

జ.) విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?

జ.) మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?

జ.) జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
జ.) కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
జ.) వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
జ.) యధాజిత్తు.


37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు? =మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
జ.) గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
జ.) శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను? =గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
జ.) భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
జ.) మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
జ.) తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
జ.) జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
జ.) నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
జ.) అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
జ.) విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
జ.) గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
జ.) శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
జ.) జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
జ.) మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
జ.) బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
జ.) జటాయువు.



Page:01    Page:02      Page:03       Page:04