1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
జ.) వాల్మీకి.
2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
జ.) నారదుడు.
3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
జ.) తమసా నది.
4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
జ.) 24,000.
5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
జ.) కుశలవులు.
6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
జ.) సరయూ నది.
7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
జ.) కోసల రాజ్యం.
8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
జ.) సుమంత్రుడు.
9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
జ.) కౌసల్య, సుమిత్ర, కైకేయి.
10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
జ.) పుత్రకామేష్ఠి.
11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
జ.) కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.
12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
జ.) జాంబవంతుడు.
13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
జ.) దేవేంద్రుడు.
14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
జ.) హనుమంతుడు.
15. కౌసల్య కుమారుని పేరేమిటి?
జ.) శ్రీరాముడు.
16. భరతుని తల్లి పేరేమిటి?
జ.) కైకేయి.
17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.
18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
జ.) వసిష్ఠుడు.
19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
జ.) 12 సంవత్సరములు.